నవతెలంగాణ-హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్రయివేట్ హోటల్లో విద్యుత్ షార్ట్ సర్కూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో భవనంలో సుమారు 40మంది నిద్రిస్తున్నారు. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వారిని సురక్షితంగా కాపాడారు. మంటలను అదుపులోకి తెచ్చారు.