చీనాబ్‌ బ్రిడ్జిపై వందేభారత్‌

Vande Bharat on Chenab Bridgeజమ్మూ కాశ్మీర్‌: జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన పై వందేభారత్‌ రైలు తొలి కూత పెట్టింది. ఈ వంతెనపై శనివారం వందేభారత్‌ రైలు ఫస్ట్‌ ట్రయల్‌ రన్స్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా స్టేషన్‌ నుంచి శ్రీనగర్‌ స్టేషన్‌ వరకూ వందే భారత్‌ రైలు పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వందేభారత్‌ టికెట్‌ ధర విషయానికి వస్తే.. ఢిల్లీ నుంచి కాశ్మీర్‌కు రూ.1,500 నుంచి రూ.2,100గా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రైలు మార్గమధ్యలో జమ్మూ, శ్రీమాతా వైష్ణోదేవి కత్రాలో స్టాప్స్‌ ఉండనున్నట్లు సమాచారం.

Spread the love