నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్‌లో నిరసన పేరుతో విధ్వంస నర్తనం జరుగుతోందని షేక్ హసీనా అన్నారు. అల్లరి మూకల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. 1975, ఆగస్టు 15న హత్యకు గురైన ఆమె తండ్రి, బంగ్లా జాతిపిత ముజీబుర్ రెహ్మాన్ సహా కుటుంబీకులకు నివాళి అర్పించారు. తన కొడుకు ట్విటర్ ద్వారా బంగ్లా పౌరులకు సందేశం పంపారు. అల్లర్లలో తనలాగే ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. వారికి న్యాయం చేయాలన్నారు.