ఎద్దును ఢీకొన్న వందే భారత్‌ రైలు 

నవతెలంగాణ-చింతకాని
వందే భారత్‌ రైలు ప్రమాదానికి గురైంది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలు ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలో నాగులవంచ వద్ద ఎద్దును ఢీకొన్నది. దీంతో ట్రైన్‌ ముందు భాగం దెబ్బతిన్నది. రైలును నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. అనంతరం రైలు బయలుదేరి వెళ్లింది. రాత్రి 11:30 గంటలకు విశాఖ చేరుకోవాల్సిన రైలు ఆలస్యంగా వెళ్లనుంది.

Spread the love