వంజరి సంఘం నూతన క్యాలెండర్‌ ఆవిష్కరణ

– ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌
నవతెలంగాణ-అంబర్‌పేట
అంబర్‌పేట వంజరి సంఘం కులస్తుల సంక్షేమ అభి వద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలు హర్షనీయ మని అంబర్‌పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేశ్‌ అన్నా రు. ఆదివారం అంబర్‌పేట వంజరి సంఘం అధ్యక్షుడు లవం గు ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమా నికి అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వంజరి కుల సంఘాల ఐక్యతకు కుల పెద్దలు ముందుకు రావడం హర్షణీయమని పేద విద్యార్థులకు కులసం ఘా నికి వ్యక్తిగతంగా అన్ని విధాలుగా అండగా ఉంటాన న్నారు.అనంతరం క్యాలెండర్‌ని అంబర్‌పేట కార్పొ రేటర్‌ ఇ.విజరుకుమార్‌గౌడ్‌కు అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, వివిధ బీసీ కులాలు తమ కుల స్తుల్లో ఐక్యత చైతన్యం తీసు కురా వడానికి డైరీలు క్యా లెండర్లు దోహదపడతాయని అంబర్‌ పేట వంజరి సం ఘం సభ్యులు ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టడం సంతో షకరమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వంజరి సం ఘం రాష్ట్ర అధ్యక్షులు కాలేరు నరేష్‌ కోశాధికారి కాలేరు అమరేందర్‌ కార్యదర్శి లవంగ పెం టోజిలు అంబర్‌పేట వంజరి సంఘం అధ్యక్షులు లవంగు ఆంజనే యులు, ప్రధాన కార్యదర్శి దౌరే గంగరాజు కోశాధికారి వారే బాలు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంజరి నాగరాజు పాల్గొన్నారు.

Spread the love