వర్సిటీ హాస్టల్స్ విద్యార్తినులకు అస్వస్థత..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ బాలికల వసతి గృహం విద్యార్తినులు ముగ్గురు గురువారం అస్వస్తతకు గురయ్యారు. హాస్టల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం జరుగుతున్న పీజీ సెమిస్టర్ పరీక్షలకు ఉదయం విద్యార్థులు హాజరయ్యారు వారిలో ఒక విద్యార్తినికి ఫిట్స్ వచ్చాయి. మరొక విద్యార్తిని రాత్రి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో కళ్లు తిరిగి కిందపడిపోయింది. గమనించిన సిబ్బంది వెంటనే వారిని డిచ్పిల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో కీడ్నీ స్టోన్ తో బాధపడుతున్న మరో విద్యార్తిని తాను కూడా ఆస్పత్రికి వెళతానని చెప్పగా ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. అనంతరం వారి కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి విద్యార్తినులను ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్తులు మాట్లాడుతూ.. యూనివర్సిటీలో ఎవరికైనా అనారోగ్యం సంబవిస్తే కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ సౌకర్యం లేదని ఆరోపించారు. క్యాంపస్లో హెల్త్ సెంటర్ ఉన్నా వైద్యులు, సిబ్బంది లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Spread the love