ఇవాళ రాత్రి వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం..

నవతెలంగాణ – హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్లు వరుణ్‌ తేజ్ లావణ్య త్రిపాఠి ఓ ఇంటివారు కాబోతున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ రీల్‌ కపుల్‌ నిశ్చితార్థం గురించి తాజా అప్‌డేట్స్‌ బయటకొచ్చాయి. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం వరుణ్‌ తేజ్‌‌-లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌ ఇవాళ రాత్రి నాగేంద్రబాబు నివాసంలో జరుగనుంది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబం, లావణ్య కుటుంబసభ్యులు మాత్రమే హాజరుకానున్నారట. అశ్విన్‌ మావ్లే లావణ్య త్రిపాఠి స్టైలిష్ట్‌ కాగా.. అనితా డోంగ్రే కాస్ట్యూమ్‌ డిజైనర్‌. ఇక వరుణ్‌తేజ్‌కు తరుణ్‌ తహిలియాని డిజైనర్‌గా వ్యవహరిస్తున్నాడు‌. వరుణ్‌తేజ్‌ ప్రస్తుతం గాండీవధారి అర్జున  సినిమాలో నటిస్తున్నాడు.  ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఆగస్టు 25న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Spread the love