పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించిన వాసికర్ల వినయ్ రెడ్డి

నవతెలంగాణ – పెద్దవూర
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం,నాయనవాని కుంట గ్రామానికి చెందిన కొట్టే బాలయ్య (70)అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు.ఈ విషయం తెలుసుకొని కాంగ్రెస్ యువ నాయకులు వాసికర్ల వినయ్ రెడ్డి  పార్ధీవ దేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ కొట్టే బాలయ్య యాదవ్ మృతి బాధాకరం అని,వారి కుటుంబ సభ్యులకు 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ వాసికర్ల విక్రమ్ రెడ్డి, కొట్టే కోటేశ్, రమేష్, సైదులు, శ్రీను,పవన్, అన్వేష్, ప్రశాంత్, శివ, కుమారులు కొట్టే చంద్రయ్య,కొట్టే ఏర్రయ్య,మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love