నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయంలో మంగళవారం హైకోర్టు సీనియర్ న్యాయవాది రాంరెడ్డి ఆధ్వర్యంలో వాస్తు నివారణ పూజా కార్యక్రమాన్ని మొదటి రోజు నాలుగు వేదాల పారాయణం నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా దేవస్థానం నందు ఉడిపి పంతుల చేత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా భిక్కనూర్ మండలంలో ఉన్న ప్రతి కుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. భిక్కనూర్ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలలో దేవాలయంకు అనుసంధానం ఉన్నటువంటి కొన్ని దేవాలయాలు కాలగర్భంలో కలవడం జరిగిందని అట్టి దేవాలయాలను పునరుద్ధరణ చేయుటకై అన్ని కుల సంఘాల పెద్దల ఐక్య కార్యచరణ కమిటీ, అన్ని పార్టీల వారితో చర్చించి కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక కళ్యాణార్థం వాస్తు నివారణ పూజా చేయడం జరుగుతుందని ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, న్యాయవాది రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని భక్తులు హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, భక్తులు, పూజారులు, పాల్గొన్నారు.