వి.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ వెండితెర అవార్డులు 2023 వేడుక ఆద్యంతం అద్భుతంగా జరిగింది. ఈ వేడుకలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లా డుతూ, ‘నటుడిగా మురళీమోహన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది. సినీ యాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసు కున్నారు’ అని చెప్పారు. ‘నా 50 సంవత్సరాల నట జీవితాన్ని పురస్క రించుకుని ‘నటసింహ చక్రవర్తి’ బిరుదునివ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి నంది అవార్డులకున్న విశిష్టత మనకు తెలుసు. కానీ తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డుల గురించి పట్టించుకోవడమే మానేశారు. ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అవార్డులను ఇవ్వడంతోపాటు ఇకనుంచి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా జరిగేలా ఈ ప్రభుత్వం చూడాలని కోరుకుంటున్నాను’ అని మురళీమోహన్ చెప్పారు. వి బి ఎంటర్టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన మాట్లాడుతూ, ‘ఈసారి వికలాంగులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతులు మీదుగా చెక్కులు అందజేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరంతో పదో వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం’ అని అన్నారు.
అవార్డుల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి మా గవర్నమెంట్ కచ్చితంగా ఇస్తుంది. తెలుగు రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళు అందరం ఒకటే. గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వాల్సి ఉన్న అవార్డులు అన్నింటినీ కూడా కచ్చితంగా ఇస్తాం.
– సినిమాటోగ్రఫీ మంత్రి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి