వీడీ బ్లాక్‌హాక్స్‌ ఓపెన్‌ విజేత రంగారెడ్డి

జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఓవరాల్‌ చాంప్‌ తెలంగాణ– ఫైనల్స్‌కు హాజరైన విజరు దేవరకొండ
హైదరాబాద్‌ : ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ జట్టు హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విజరు దేవరకొండ (వీడీ) బ్లాక్‌హాక్స్‌ ఓపెన్‌ విజేతగా రంగారెడ్డి జిల్లా జట్టు నిలిచింది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో నెల్లూరు జట్టుపై రంగారెడ్డి 15-7, 15-11తో వరుస సెట్లలో విజయం సాధించింది. సినీ నటుడు, బ్లాక్‌హాక్స్‌ సహ యజమాని విజరు దేవరకొండ ఫైనల్‌ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. బ్లాక్‌హాక్స్‌ ప్రిన్సిపల్‌ యజమాని అభిషేక్‌ రెడ్డి, చీఫ్‌ కోచ్‌ జొరెన్‌ కెడాసిక్‌తో కలిసి రానున్న ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ సీజన్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ జట్టు ధరించే జెర్సీని విజరు దేవరకొండ ఆవిష్కరించారు.

Spread the love