నవతెలంగాణ – వేములవాడ
నిజాం కు వ్యతిరేకంగా పొర బాట నడిపిన వీరనారి చాకలి ఐలమ్మ అని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక వద్ద చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దేశముఖ్ లు, దొరలంతా నిజాం కు అనుచరులుగా ఉంటూ భూమి కోసం ప్రజలను బానిసలుగా, పెత్తనం చలా ఇస్తున్న వారిపై చాకలి ఐలమ్మ పోరుబాట నడిపిన ఆదర్శ మూర్తురాలని కొనియాడారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ఆమె అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రంలో మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్తపు రాజు, కౌన్సిలర్ సిరిగిరి చందు, ప్రసాద్ రావు,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బాల్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, నరాల దేవేందర్,జిల్లా రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మైలారపు రాము, మాజీ సర్పంచ్ తిరుపతి,రూరల్ మండల అధ్యక్షులు మొగిలి అంజయ్య, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి దేవయ్య, నేరెళ్ల నర్సయ్య, దేవయ్య, మహేందర్ యాదవ్, ప్రేమ్ చారీ, లిక్కిడి మహేందర్, కర్ల శేఖర,రాజేష్,శ్రీనివాస్ తో పాటు తదితరులు ఉన్నారు.