వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత ఐలమ్మ

Veeravanita Ailamma who fought for the liberation of Vetti Chakiri– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఐలమ్మకు నివాళి
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం తెలంగాణ సాయుధ పోరాట వీరనారీ ఐలమ్మ 39వ వర్ధంతిని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని రిమ్స్‌ ఎదుట గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా సుందరయ్య భవనం నుంచి ఐలమ్మ విగ్రహం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌ మాట్లాడుతూ ఐలమ్మ దేశముఖ్‌ విస్నూర్‌ రాంచంద్రారెడ్డి అనే భూస్వామికి వ్యతిరేకంగా తన భూమిని రక్షించుకోవడం కోసం ఐలమ్మ పోరాడిందన్నారు. భూమి కోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి విముక్తికోసం 1946 నుంచి 1951 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిందని అన్నారు. తన సొంత ఇంటినే కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంగా మార్చి ప్రజలకు చైతన్యం కలిగించిందన్నారు. కుల, మతాలకు అతీతంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని కులం, మతం, రంగు పులిమి బీజేపీ రాజకీయ లబ్దిపొందే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఐలమ్మ వర్ధంతిని అధికారికంగా జరపడం స్వాగతిస్తున్నామన్నారు. ఐలమ్మకు దండలు వేసి, దండం పెట్టడంతో సరిపెట్టుకోవద్దన్నారు. ఐలమ్మ ఆశయం భూమిలేని పేదలకు భూములు పంచడం, వెట్టిచాకిరి విముక్తి గావించడం అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేసినప్పుడే ఐలమ్మకు నిజమైన నివాళి అర్పించినట్లు అని అన్నారు. ఐలమ్మ స్పూర్తితో పార్టీ శ్రేణులు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తొడసం భీంరావు, జిల్లా కమిటీ సభ్యులు ఆర్‌.మంజుల, రూరల్‌ మండల కార్యదర్శి ఎన్‌.స్వామి, భగత్‌ నాయకులు ప్రభు, సీఐటీయూ నాయకులు ఆర్‌.సురేందర్‌, లింగాల చిన్నన్న, అగ్గిమల్ల స్వామి, సురేష్‌, పండుగ పొచ్చన్న, సుమన్‌ తాయి, రమాకాంత్‌, వ్యకాస నాయకులు కే.ఆశన్న పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో…
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ధీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రిమ్స్‌ ఆస్పత్రి ఎదుట గల చాకలి ఐలమ్మ విగ్రహానికి కాంగ్రెస్‌ ఆదిలాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీ కంది శ్రీనివాస్‌రెడ్డి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఆనాడు భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అంటూ అభివర్ణించారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షులు గుడిపల్లి నగేష్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు లోక ప్రవీణ్‌ రెడ్డి, కౌన్సిలర్లు బండారి సతీష్‌, కలాల శ్రీనివాస్‌, సంద నర్సింగ్‌, యెల్మెల్వార్‌ అర్చన రామ్‌ కుమార్‌, బీసీ సంఘం అధ్యక్షులు దత్తు, నాయకులు పోరెడ్డి కిషన్‌, సింగిరెడ్డి రామ్‌రెడ్డి, ఓరగంటి అఖిల్‌, అనుముల ఉదరు కిరణ్‌, కుర్ర నరేష్‌, బండారి చిన్నయ్య, సంజీవ్‌రెడ్డి, అశోక్‌, లస్మన్న ఉన్నారు.
బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో…
సమైఖ్యాంధ్రలో కనుమరుగైన తెలంగాణ యోధుల చరిత్ర నేటి తరానికి తెలియజేసేలా వారి జయంతులు, వర్దంతులను అధికారికంగా నిర్వహించేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాలు తీసుకున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. చాకలి ఐలమ్మ వీరత్వాన్ని నేడు స్ఫూర్తిగా పొందాలన్నారు. మంగళవారం వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని రిమ్స్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ తెలంగాణ రాకముందు తెలంగాణా సమర యోధుల చరిత్రను అప్పటి ఆంద్ర నాయకులూ కనుమరుగు చేశారని అన్నారు. వారి చరిత్రను తెలియజెప్పేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక కార్యక్రమాలను నిర్వహించారని అన్నారు. పెత్తందారులు, రజాకార్లు, నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ స్పూర్తితో నేటి తరం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు నారాయణ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు, రజక సంఘం పట్టణ అధ్యక్షుడు సంతోష్‌ పాల్గొన్నారు.
ముధోల్‌ : వీరనారి చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని ఆమె ఆశయాలను కొనసాగించాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ తెగువ, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పి ఎందరికో ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు కోట్ల శ్యామ్‌, మున్నూరు కాపు తాలూకా అధ్యక్షుడు రోళ్ల రమేష్‌, బీజేపీ మండలాధ్యక్షుడు కోరి పోతన్న, మాజీ ఎంపీటీసీలు, దేవోజీ భూమేష్‌, పోతన్న యాదవ్‌, నాయకులు టి.రమేష్‌, మోహన్‌ యాదవ్‌, ధర్మపురి శ్రీనివాస్‌, గంగాధర్‌, సభ్యులు, భీమన్న, మహేష్‌, నారాయణ, గంగాధర్‌, బాలు, సాయినాథ్‌, రమేష్‌, సాయినాథ్‌, భోజన్న పాల్గొన్నారు.
తలమడుగు : మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు జక్కులు ఆశన్న మాట్లాడారు. చాకలి ఐలమ్మ వీరనారి గొప్ప పోరాట యోధురాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చంటి, గిరిజన నాయకులు నీలగిరి అశోక్‌, రజక సంఘ నాయకులు లింగన్న, ఆనంద్‌, నర్సింగ్‌ పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌రూరల్‌ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అడుగుజాడల్లో యువత నడువాలని తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఎదుట ఉన్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి చాకలి ఐలమ్మ ప్రతీక అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి, తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ఆమె తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శమని అన్నారు. ఆయన వెంట మావల మండలాధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్‌, మాజీ వైస్‌ ఎంపీపీ అట్ల గోవర్ధన్‌రెడ్డి, మౌనిష్‌రెడ్డి, ఆదివాసీ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌, మావల మండల బీసీ సంఘం అధ్యక్షులు అడెల్లు, ప్రభాకర్‌ వెంకటేష్‌, గంగన్న పాల్గొన్నారు.

Spread the love