సర్కారు బడుల్లో వెజ్‌ బిర్యానీ

– విద్యార్థులకు ఉదయం రాగిజావ
– వారంలో మూడు రోజులు గుడ్డు
– మధ్యాహ్న భోజనం మెనూ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో వెజ్‌బిర్యానీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు ఉదయం రాగిజావ ఇవ్వనున్నట్టు ప్రకటిం చింది. వారంలో మూడు రోజులు గుడ్డు అందించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన శనివారం మధ్యాహ్న భోజనం మెనూను విడుదల చేశారు. విద్యార్థులకు వారంలో ఒక రోజు కిచిడీ, వెజ్‌ బిర్యానీ అందించాలని నిర్ణయించామని తెలిపారు. విద్యార్థులకు ఉదయం వారంలో మూడు రోజులు రాగిజావ అందించనున్నట్టు వివరించారు. ప్రతిరోజూ మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ అందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికీ రోజుకు రూ.5.45, ఆరు నుంచి ఎనిమిదో విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.8.17, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.10.67 చెల్లిస్తున్న విషయం తెలి సిందే. రాష్ట్రంలోని 26,065 సర్కారు బడుల్లో 23 లక్షల మంది విద్యా ర్థులు చదువుకుంటున్నారు. ఈ పథకం అమలుకు అయ్యే మొత్తం వ్యయం రూ.323.71 కోట్లలో కేంద్రం రూ.203.76 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.119.95 కోట్లను భరిస్తున్నాయి.
మధ్యాహ్న భోజనం మెనూ వివరాలు
వారం రోజువారీగా ఇచ్చే భోజనం
సోమవారం కిచిడీ+మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ, గుడ్డు
మంగళవారం అన్నం+సాంబార్‌+మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ
బుధవారం అన్నం+ఆకుకూర పప్పు+మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ, గుడ్డు
గురువారం వెజిటబుల్‌ బిర్యానీ+మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ
శుక్రవారం అన్నం+సాంబార్‌+మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ, గుడ్డు
శనివారం అన్నం+ఆకుకూర పప్పు+మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ

Spread the love