– సెంచరీ దాటిన పచ్చిమిర్చి
– చుక్కలనంటుతున్న వైనం
– సామాన్యుడిపై భారం
నవతెలంగాణ- మల్హర్ రావు:
మండలంలో కూరగాయల ధరలు వహుక్కాలనంటుతున్నాయి. భగ్గుమంటున్న ఎండలతో పాటే వాటి ధరలు కూడా మండిపోతున్నాయి. రైతు బజార్లో పక్షం రోజుల వ్యవదిలో ధరలు రెట్టింపు అయ్యాయి. రూ.50 నుంచి రూ.100 పెట్టనిదే ఎలాంటి కూరగాయలు రావడం లేదు. దీంతో సామాన్యులు కొనలేని, తినలేని పరిస్థితి నెలకొంది. ఇక ప్రయివేటు వ్యాపారుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎండాకాలం పేరిట మరింత అదనపు ధరను పెంచి విక్రయిస్తున్నారు.పెరిగిన ధరలతో సామాన్యులు బెంబేలెత్తిస్తున్నాయి. ఎండల తీవ్రతతో దిగుబడి తగ్గి ధరలు పెరిగాయని మరో నెలరోజులపాటు ఇదే పరిస్థితి ఉండనుందని కూరగాయల విక్రయదారులు చెబుతున్నారు.
మండుతున్న ధరలు…..
వంటింట్లో ఎలాంటి వంటకం చేయాలన్న టమాట, పచ్చిమిర్చి తప్పనిసరిగా ఉండాలి. రోజువారీ వాడకంలో కీలకమైన విటీలో మిర్చి ధర ఘాటెక్కింది. ఏకంగా సెంచరీ దాటింది. టమాట పక్షం రోజుల కిందట కిలోకు రూ.20 లభించింది. ప్రస్తుతం ధర రూ.90 కి చేరింది. దొండ, బిరా, కాకర, బెండ, అలసంద, గోరుచుకుడు ధరలు కూడా భారీగానే పెరిగాయి. వంకాయ తమాటతో పోటీ పడుతుంది.ప్రస్తుతం రూ.70కి చేరింది.ఇక క్యారెట్,బిట్ రూట్,బిన్స్, చిక్కుడు,ముల్కయా ధరలు వందకు చేరాయి.దీంతో సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఓవైపు భగభగ మండే ఎండలతో ఉపాది లేక కూలీలు, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూరగాయల ధరలు పెనుభారంగా మారాయి. వాటిని కొనుగోలు చేయడం అటు ఉంచితే ధరలు వింటేనే ఆందోళన చెందుతున్నారు.కిలోల్లో కొనుగోలు చేసిన వారు ఇప్పుడు పావుకిలో,అరకిలో,అర్దపావుతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఎండల ప్రభావమే కారణం…..
కూరగాయల ధరలు పెరగడానికి ఎండల ప్రభావమే కారణమని మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మండలానికి ఎక్కువగా మంథని,పెద్దపల్లి నుంచి దిగుమతి అవుతుంటాయని అక్కడ తగినంత స్టాక్ లభించని పరిస్థితి ఉందంటూన్నారు.ఎండల తీవ్రత కారణంగా పంటల దిగుబడి తగ్గి దాని ప్రభావం ధరలపై పడింధని అభిప్రాయపడుతున్నారు.
ధరలు నియంత్రించాలి….బాంయ్య రైతు కూలి.
పెరిగున కూరగాయల ధరలు ఇబ్బందిగా మారాయి.ఎండలతోపాటు కూరగాయల ధరలు సైతం మండుతున్నాయి. గతంలో రూ.400 తీసుకపోతే సంచినిండా కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం మూడు నాలుగు రకాలు రాలేని పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి కూరగాయల ధరలు కట్టడికి చర్యలు తీసుకోవాలి.
ఎం కొనలేని పరిస్థితి….సమ్మక్క కూలి.
మార్కెట్ తోపాటు రైతు బజార్ లోను కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. టమాట కిలో రూ.80 ఉండగా ఇతర రకాల కూరగాయలు వందకు చేరాయి. పెరిగిన ధరలతో కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.కిలోల చొప్పున కొనుగోలు చేసేవారు పావుకిలో, అరకిలోతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి.
కూరగాయల ధరలు ఇలా…..
టమాట., కిలో రూ.90, పచ్చి మిర్చి రూ.110, వంకాయ రూ.70, బీరకాయ రూ.70, గోరుచిక్కుడు రూ.70, అలసంద రూ.80, బెండకాయ రూ.60, క్యారెట్ రూ.100, క్యాబేజీ రూ.70, చిక్కుడు కాయ రూ.70, పువ్వు గోపి రూ.70, మునగకాయలు రూ.80, సిమ్లా మిర్చి రూ.80