65 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు

మనోహరాబాద్‌ వ్యవసాయ అధికారి రాజశేఖర్‌
నవతెలంగాణ-తూప్రాన్‌ రూరల్‌ మనోహరాబాద్‌
మనోహరబాద్‌ మండల వ్యాప్తంగా రైతులకు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులోకి వచ్చాయని రైతులు విత్తనాలను కొనుగోలు చేసుకోవాలని వ్యవసాయ అధికారి రాజశేఖర్‌ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అగ్రో రైతు సేవ కేంద్రాల ద్వారా రైతులకు 65వ శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ పచ్చిరొట్ట విత్తనాలు కావలసిన రైతులు తమ పట్టాదార్‌ పాస్‌ పుస్తకం ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌ కాపీలను వ్యవసాయ శాఖ కార్యాలయంలో అందజేసి ఆన్లైన్‌ పర్మిట్‌ పొందాలని సూచించారు. ఆ పర్మిట్లు తీసుకుని అగ్రో సేవా కేంద్ర కేంద్రాల్లో అందించి విత్తనాలను పొందాలని సూచించారు. 65 శాతం సబ్సిడీ పోను 30 కేజీల జీలుగ బస్తా ధర రూ.842.70లని తెలిపారు. ఒక బస్తా రెండున్నర ఎకరాలకు సరిపోతుందని, పచ్చిరొట్ట విత్తనాలు వాడడం వల్ల భూమి భౌతిక, రసాయన స్థితి మెరుగుపడుతుం దన్నారు. దాంతో పాటు గా సేంద్రియ కర్బన పదార్థం పెరిగి పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు వాన పాముల సంతతి పెరిగి భూసారం పెరిగి తద్వారా రైతుల పంట దిగు బడి పెరిగే అవకాశం ఉంటుందని తెలిపా రు. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచిం చారు. రైతులు పచ్చిరొట్ట వేయడం వల్ల ఎకరానీకి 10 టన్నుల పచ్చి రొట్ట ఏరువు లబిస్తుంది .60 కిలోల నత్రజని , 15 కేజీల భాస్వరం , 50 కేజీల పొటాష్‌ భూమిలో కలుస్తుందని అన్నారు. పచ్చి రొట్ట ఎరువులు వేసుకోవడం వల్ల నేల బౌతిక స్థితి మెరుగుపడి, భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుందని తెలిపారు. నేలలో సేంద్రీయ పదార్థం పెరగడం వల్ల సూక్ష్మ జీవులు వద్ధి చెంది, జీవ రసాయనిక చర్యల వల్ల నేల సారం పెరగడమే కాక, నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకొని ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచు కుంటుందని తెలిపారు. భూమిలో రసాయన ఎరువులు వేసినపుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చని, చౌడు భూముల పునరుద్దరణకు ఉపయోగపడుతుందని ఎకరానికి 12 నుంచి 15 కిలోల పచ్చి రొట్ట విత్తనం అవసరం ఉంటుందని వ్యవసాయ అధికారి రాజశేఖర్‌ పేర్కొన్నారు.

Spread the love