హరితహారం వల్లే వృక్ష సంపద పెరుగుతుంది

చెట్టంటే అమ్మతో సమానం. అడగకుండానే అన్నీ ఇస్తుంది. పుట్టుక నుంచి చావుదాకా కల్ప‘తరువై’ నిలుస్తుంది. జీవకోటికి ప్రాణవాయువును ఇచ్చి, ఆయువు నిలుపుతుంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది. సకాలంలో వానలు కురిపించి కరువు కాటకాలు లేకుండా చేస్తుంది. సమస్త మానవాళికి మనుగడనిస్తున్నది. అందుకే ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం.. సంరక్షిద్దాం! ఎమ్మెల్యే హనుమాన్ షిండే ఎంపీ బీబీ పాటిల్ 

నవ తెలంగాణపెద్దకొడప్ గల్ 
మండలంలోని చిన్న తక్కడపల్లి గ్రామంలో సోమవారం రోజున తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వృక్ష సంపదలో కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులు అధికారులు మొక్కలు నాటి వాటికి నీళ్లు పోయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హనుమాన్ షిండే,ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ మండల మరియు పరిసర ప్రాంత గ్రామాల వ్యాప్తంగా పచ్చదనం పరిస్థితి అధ్వానంగా ఉండేది. స్మగ్లర్లు అడవులను యథేచ్ఛగా నరికివేయడంతో అంతరించి పోయాయి. ఫలితంగా అటవీ విస్తీర్ణం తగ్గింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పచ్చదనం పెంపొందించడానికి ఉపయోగపడింది. యేటా వానకాలం ప్రారంభం నుంచి మూడు నెలలపాటు హరితహారం కొనసాగుతోంది. అడవుల్లోని ఖాళీ ప్రదేశాలు, పల్లెలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా, చెరువు, పొలాల గట్లు, ప్రజలు తమ ఇండ్లలో మొక్కలు నాటేలా అధికారుల చర్యలు తీసుకున్నారు. వీటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలను కాపాడడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. జియో ట్యాగింగ్‌ విధానాన్ని అమలు చేశారు. నాలుగు వేల మొక్కల సంరక్షణకు ఒకరిని నియమించి, ఎండాకాలంలో మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించారు. మొక్కల రక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. హరితహారం మొక్కలను ధ్వంసం చేసినా, పశువులు మేసినా.. అందుకు బాధ్యులైన వారికి జరిమానా విధించారు ఫలితంగా హరితహారం కార్యక్రమం విజయవంతమైంది నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చెట్లుగా మారాయి. తొమ్మిదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా  పచ్చదనం పెరిగింది. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ జితిష్ పాటిల్, ఎంపీపీ ప్రతాప్ రెడ్డి,సర్పంచ్ అశోక్ పటేల్, ఎంపీడీవో రాణి, సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, ఎంపీఓ సురేకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love