వాహనాలు 15ఏండ్లు దాటినా వాడుకోవచ్చు.. కానీ

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో 15ఏండ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ‘వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. ఆ వాహనాలు ఫిట్‌గా ఉన్నాయనిపిస్తే నడుపుకోవచ్చు. అయితే తదుపరి 5ఏండ్తకు రూ. 5000, మరో పదేళ్లకు రూ. 10000 గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలి. పాత వాహనాన్ని తుక్కుగా మార్చాలా వద్దా అనేది యజమాని నిర్ణయించుకుంటారు. మారిస్తే తర్వాతి వాహనానికి రాయితీ వస్తుంది.

Spread the love