వర్కింగ్ జర్నలిస్టు మండల అద్యక్షుడిగా ‘ వేమా సురేష్ ’

నవతెలంగాణ-మంగపేట
మంగపేట మండల వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నూతన అద్యక్షుడిగా వేమా సురేష్ ఎన్నికయ్యారు. శనివారం మండలంలోని మల్లూరు లక్ష్మీ బృందవనం రిసార్టులో మండల వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం ధర్మపురి శ్రీనివాస్, నిమ్మగడ్డ శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మండల వర్కింగ్ జర్నలిస్టులు 35 మంది తొలుత మండలంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ అభిప్రాయాలను ఒక్కొక్కరుగా వెల్లడించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకునేందుకు నిర్ణయించారు. అద్యక్ష పదవికి వేమా సురేష్, కరుటూరు సాంబశివరావు, మేడ ఆదినారాయణలు, ప్రధాన కార్యదర్శి పదవికి వడ్లకొండ వీరయ్య, పల్లాపు రమేష్ లు పోటీకి నిలబడగా ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ లో వేమా సురేష్ కు 21, కటుకూరి సాంబశివరావుకు 11, మేడ ఆదినారాయణకు 2 ఓట్లు పడ్డాయి దీంతో వేమ సురేష్ సమీప ప్రత్యర్థి సాంబశివరావుపై 10 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. ప్రదాన కార్యదర్శిగా వడ్లకొండ వీరయ్యకు 23 ఓట్లు రాగా పల్లాపు రమేష్ కు 8 ఓట్లు రాగా వడ్లకొండ వీరయ్య సమీప ప్రత్యర్థి పల్లాపు రమేష్ పై 15 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం నూతనంగా ఎన్నికైనా అద్యక్ష, కార్యదర్శులు వేమా సురేష్, వీరయ్యలు మాట్లాడుతూ మండలంలోని వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల సాధనకు కృషి చేస్తామని ఇంటి స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సాధిస్తామని భరోసా ఇచ్చారు. అదే విధంగా జర్నలిస్టుల సమస్యల సాధనకు ఐక్యంగా పోరాడి పరిష్కరిస్తామని నమ్మబలికారు. సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు ఎరన్రం స్వామి, మేడ ఆదినారాయణ, కల్లెబోయిన శ్రీనివాస్, వడ్లకొండ శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్, అక్కినపెల్లి వెంకన్న, మఠం రమేష్, నిమ్మగడ్డ శ్రీనివాస్, కురిమిల్ల శ్యాం, సాంబశివరావు, నరేష్, రాజేష్, జయరాజ్, సురేందర్, పవన్ కల్యాణ్, స్నేహకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love