వేములవాడ, సంగారెడ్డి సీట్ల మార్పుపై తెలీదు

– తాము అధికారంలోకి వస్తే జనాభా ఆధారంగా బడ్జెట్‌ : డాక్టర్‌ కె.లక్ష్మణ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వేములవాడ, సంగారెడ్డి నియోజకవర్గాల అభ్యర్థులను చివరి నిమిషంలో ఏ కారణాలతో మార్చారో తనకు తెలియదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే జనాభా ఆధారంగా బడ్జెట్‌ కేటాయింపులుంటాయని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్‌ కత్రియాలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌లో ఏమాత్రం పసలేదని విమర్శించారు. కాంగ్రెస్‌, బీఅర్‌ఎస్‌ పార్టీలు బీసీని సీఎం చేస్తామని ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోని రెడ్లు ఎవరివారు తామే సీఎం అభ్యర్థులమని ప్రకటించుకున్నారని విమర్శించారు. బీసీలు కేవలం పింఛన్లకే అర్హులా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సిద్ధ రామయ్య బీసీ ముసుగులో ఉండి కుల గణాంక విషయాలు బయట పెట్టలేదని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో తెలంగాణలో ఉన్న ఉత్తరాంధ్రకు చెందిన 26బీసీ కులాల ఊసేదని ప్రశ్నించారు.బీసీ సబ్‌ ప్లాన్‌ కు చట్టబద్దత, బీసీ కమిషన్‌ కు రాజ్యాంగ హౌదా కల్పిస్తామన్నారు.

Spread the love