కరాటే లో మెరిసిన వేములవాడ విద్యార్థులు

– బ్లాక్, బ్రౌన్ బెల్టులు సాధించిన పలువురు విద్యార్థులు
– అభినందించిన కరీంనగర్ ఏసీపి తుల శ్రీనివాసరావు
నవతెలంగాణ – వేములవాడ
ఒకినావ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కరాటే చీఫ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ మన్నన్ ఆధ్వర్యంలోగత 4 సంవత్సరాలు గా కరాటే శిక్షణ పొందిన 7 మంది విద్యార్థులు విద్యార్థులుకరాటే లో బ్లాక్ బెల్ట్స్ సాధించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతి నగర్ నియో కి ఫన్ ల్యాండ్ వారి హాల్లో ఒకినావ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ ,చీఫ్ ఎగ్జామినేర్ షిహాన్ కె. వసంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్ బెల్ట్, బ్రౌన్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో వేములవాడకు చెందిన ముద్రం ప్రణయ్ శ్రీ, హృదయ శ్రీ నిక్షిత్ కుమార్, గంగుల వినయ్ శ్రీ యాదవ్, అనుగుల హరిహరన్, శివ, చెర్ల సూర్య జై చందర్ లు బ్లాక్ బెల్టులు, గుడిసె విజయ్ కుమార్, ప్రతాప రిశిక్ తేజ, చిమ్మిని మణిదీప్,ఎస్.కె. షరీన్, ఎస్.కె.తనహాజ అనే విద్యార్థులు బ్రౌన్ బెల్టులు సాధించారు. వారికి చీఫ్ ఎగ్జామినర్ షిహాన్ కె .వసంత్ కుమార్ బ్రౌన్ బెల్టులతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం బ్లాక్, బ్రౌన్ బెల్టులు సాధించిన విద్యార్థులను కరీంనగర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ తుల శ్రీనివాసరావు తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నిత్య జీవితంలో అనూహ్యంగా తమపై జరిగే దాడులను ఎదుర్కోవడంతో పాటు ఆత్మరక్షణ కొరకు కరాటే ను విద్యార్థిని, విద్యార్థులందరూ తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. కరాటే విద్యతో శరీరకంగా, మానసికంగా ఎంతో దృఢత్వం అలవడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే ఎగ్జామినర్, కె. వసంత్ కుమార్, రాజన్న సిరిసిల్ల సీనియర్ మాస్టర్ అబ్దుల్ మన్నన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Spread the love