వెంకట్‌రెడ్డి మృతి సీపీఐ(ఎం)కు తీరనిలోటు

– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్‌
పట్టణానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు పులిచింతల వెంకటరెడ్డి మృతి సీపీఐ(ఎం)కు తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.శుక్రవారం ఆయన వెంకట్‌రెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.పేద ప్రజల సంక్షేమం కోసం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాలు మరువలేనివన్నారు. ఫోన్‌లో వెంకటరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. శనివారం జరిగే అంత్యక్రియలో పాల్గొంటానన్నారు.
వెంకట్‌రెడ్డి మృతి పట్ల సంతాపం
పట్టణానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు పులిచింతల వెంకటరెడ్డి మృతి పట్ల ఆపార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి సంతాపం తెలిపారు.శుక్రవారం ఆయన వెంకటరెడ్డి మతదేహాన్ని సందర్శించి పూలమాలలేసి నివాళులర్పించారు.పార్టీకి వెంకట్‌రెడ్డి చేసిన సేవలను కొనియాడారు.
అంత్యక్రియలకు హాజరుకానున్న తమ్మినేని..
పట్టణంలో శనివారం జరిగే వెంకట్‌రెడ్డి అంత్యక్రియలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరుకానున్నట్లు పట్టణ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ,మల్లు లక్ష్మీ, నంద్యాల నర్సింహారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి హాజరుకానున్నట్టు పేర్కొంది.కాగా అంత్యక్రియలో పార్టీ నాయకులు ,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మేదరమెట్ల వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Spread the love