నవతెలంగాణ – కంటేశ్వర్
పైడి వెంకట్రాంరెడ్డి బిజెపి సీనియర్ నాయకులు మాజీ ఉద్యమకారుడు నిజాంబాద్ ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా తాడ్వాయి మండల పార్టీ అధ్యక్షులుగా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి ఆదివారం బిజెపి రవీందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే దగ్గర అనుచరుడుగా ఉన్న వెంకటరామిరెడ్డి తిరిగి సొంతగూటికి చేరడం జరిగింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో హైదరబాద్ లో గులాబీ కండువా కప్పుకున్నారు. వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకి కేసిఆర్ వల్లే అభివృద్ధి అని మోడీ విధానాలు బిజెపి విధానాలు తెలంగాణకి ద్రోహం తప్ప ఒరిగేదేంలేదని టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. అతనితోపాటు చిట్టి గంగారం కురుమ సంఘం మండల అధ్యక్షులు జైపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి చాకలి సాయిలు శ్రీకాంత్ రెడ్డి సంజీవరెడ్డి పార్టీలో చేరడం జరిగింది.