నవతెలంగాణ-కోల్‌బెల్ట్
త్వరలో జరగబోయే సింగరేణి ట్రేడ్ యూనియన్ ఎన్ని కలలో భూపాలపల్లి ఏరియాలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) విజయ ఢంకా మోగించడం ఖాయమని ఆ సంఘం కేంద్ర కమిటీ సభ్యులు బత్తుల వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం భూపాలపల్లి డివిజన్‌లోని కేటికే -8 గని వద్ద కార్మికులతో కలిసి ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు, చేకూర్చిన ఆర్థిక ప్రయోజనాలే టీబీజీకేఎస్‌ను ముచ్చటగా మూడోసారి గెలిపిస్తాయని చెప్పారు. గతంలో కార్మిక సంఘాలు పోగొట్టిన అనేక హక్కులను టీబీజీకేఎస్ సాధించిందన్నారు. ప్రస్తుతం కోల్ ఇండియాలో కంటే అనేక ప్రయోజనాలు కార్మికులు పొం దుతున్నారని గుర్తు చేశారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీబీజీకేఎస్ అగ్ర నాయకులు వెంకట్రా వు, రాజిరెడ్డి, మల్లయ్య ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియా లో గులాబీ జెండా ఎగురవేస్తామని అన్నారు. నాయకులు జగత్ రావు, రామ్ చందర్, రవీందర్, రాజేందర్, చీకటి తిరుపతి ,చీకటి నారాయణ తదితరులు పాల్గొన్నారు.