14 నుంచి శెట్టిపల్లిలో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

– అన్ని హంగులతో ఆలయం ముస్తాబు
-15 నుంచి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు
– వివరాలు వెళ్ళడించిన నిర్వాహకులు ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం
నవతెలంగాణ – ఆమనగల్
  మండలంలోని శెట్టిపల్లిలో గల ప్రసిద్ధ అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆమనగల్ మండలంతో పాటు పరిసర మండలాల భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాలకు  తరలి వస్తారు. ఆదివారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మాజీ సర్పంచ్ గోదాదేవి సత్యం, ఆలయ చైర్మన్ శ్రీనివాస్, ట్రస్ట్ కోట్ల జగన్మోహన్, అర్చకులు నవీన్ శర్మ, గూడా కృష్ణమాచార్య తదితరులు పరిశీలించారు. 14న గణపతి పూజ, పుణ్య హోమావచనం, మంత్రపుష్పం, 15న వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం, సామూహిక కుంకుమార్చన అన్నదాన కార్యక్రమం, 16న రథోత్సవం, 17న చక్ర తీర్థం, 18న ముగింపు వేడుక కార్యక్రమాలు ఉంటాయని వారు వివరించారు.
15 నుంచి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు.
  శెట్టిపల్లి గ్రామంలో ఈనెల 15 నుంచి 17 వరకు రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు, మాజీ సర్పంచ్ ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం తెలిపారు. 3వ ఓపెన్ టు ఆల్ వాలీబాల్ పోటీలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు వారు తెలిపారు. గ్రామంలో ఉన్న శ్రీ అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు  సత్యం చెప్పుకొచ్చారు. బాలుర విభాగంలో మొదటి బహుమతి రూ.20,116, రెండో బహుమతి రూ.10,116, మూడవ బహుమతి రూ.5,116లు, బాలికల విభాగంలో మొదటి బహుమతి రూ.15,116, రెండో బహుమతి రూ.10,116, మూడవ బహుమతి రూ.6,116, నాల్గవ బహుమతి రూ.4,116లు, పాఠశాల స్థాయి విభాగంలో మొదటి బహుమతి 4,116, రెండో బహుమతి 3,116 మూడవ బహుమతి 2,116 నాలుగో బహుమతి రూ .1,116 అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఎంట్రీ ఫీజు రూ.300 చెల్లించి తమ జట్ల పేర్లు నమోదు చేయించుకోవాలని సత్యం కోరారు. టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాలీబాల్ పోటీలకు సంబంధించి రూపొందించిన కరపత్రాలను రేణుక రాజరాజేశ్వరి పీఠం నిర్వాహకులు, వేద పండితులు మెళ్లూరి నెల్లూరి నవీన్ శర్మతో కలిసి వారు ఆవిష్కరించారు.
Spread the love