– పీసీబీపై బీసీసీఐ బాస్ ప్రశంసలు
న్యూఢిల్లీ : ‘పాకిస్థాన్ మమ్మల్ని చాలా బాగా చూసుకుంది. మాకు ఎటువంటి అసౌ కర్యం కలుగకుండా జాగ్త్రతలు తీసుకుంది. పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ హౌస్‌లో పీసీబీ గొప్ప ఆతిథ్యం ఇచ్చింది’ అంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఆ దేశ ఆతిథ్యంపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ప్రశంసలు కురిపించారు. ఆసియా కప్ ఆతిథ్య దేశంగా పీసీబీ ఆహ్వానం మేరకు రోజర్ బిన్ని, రాజీవ్ శుక్లాలు రెండు రోజుల పర్యటన నిమిత్తం పాకిస్థాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. క్రికెట్ ప్రధాన అజెండా సాగిన పర్యటనలో పీసీబీ ప్రతినిధులతో బిన్ని, శుక్లాలు విలువైన చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. 17 ఏండ్ల విరామం అనంతరం భారత క్రికెట్ ప్రతినిధులు పాక్ గడ్డపై అడుగు పెట్టగా.. పీసీబీ ఘనంగా ఆహ్వానించి, ఆతిథ్యం అందించి.. వీడ్కోలు పలికింది. అటారి-వాఘా సరిహద్దు నుంచి బుధవారం భారత్‌కు చేరు కున్న రోజర్ బిన్ని, రాజీవ్ శుక్లాలు పాక్ పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇరు దేశాల నడుమ క్రికెట్ సంబంధాలు ప్రభుత్వ పరిధిలోని అంశం. ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాలి. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లో భారత్ అన్ని దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంది. శ్రీలంక, పాక్‌లో పర్యటనలో అందులో భాగమే’ అని రోజర్ బిన్ని తెలిపారు. ‘2004లో పాక్‌లో పర్యటిం చిన ఫ్రెండ్ షిప్ సిరీస్‌లోనూ నేను ఉన్నాను. క్రికెట్ ఎప్పుడూ మైత్రి బంధా నికి వారధిగా నిలుస్తుంది. ఆ సమయంలో స్థానిక వ్యాపారులు భారత ప్రతినిధుల వద్ద డబ్బులు తీసుకునేందుకు నిరాకరించారు. అంత గొప్ప వాతావరణం కల్పించే శక్తి క్రికెట్‌కు ఉంది’ అని రాజీవ్ శుక్లా అన్నారు. రెండు దేశాల నడుమ ఉద్రిక్తలు తగ్గించేందుకు ద్వైపాక్షిక క్రికెట్ సంబం ధాలు దౌత్య వారధిగా నిలుస్తాయనే అభిప్రాయం బిన్ని, శుక్లా వ్యక్తం చేశారు.