ప్రముఖ నటుడు విశ్వేశ్వరరావు కన్నుమూత

నవతెలంగాణ – హైదరాబాద్: తమిళ, తెలుగు చిత్రాలలో హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందిన నటుడు విశ్వేశ్వరరావు (62) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నై సమీపాన సిరుశేరిలోని ఆయన నివాసంలో ఉంచారు. ఆయన స్వస్థలం ఏపీలోని కాకినాడ. ఆయన పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. దర్శకునిగా, నిర్మాతగానూ వ్యవహరించారు.
Spread the love