ప్రజా భవన్‌కు భారీగా తరలివచ్చిన డీఎస్సీ 2008 బాధితులు..

నవతెలంగాణ-హైదరాబాద్ :  హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు డీఎస్సీ 2008 బాధితులు భారీగా తరలి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రజావాణి నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి 300 మందికిపై అభ్యర్థులు ప్రజాభవన్‌కు వచ్చారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, గతంలో రేవంత్‌ రెడ్డి కూడా తమకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. డీఎస్సీ 2008కి చెందిన వెయ్యి మంది బాధితుల 15 ఏళ్ల కన్నీళ్లను తుడవాలని కోరారు. తమ విషయమై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love