తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాలు పురస్కరించుకుని అశ్వారావుపేట లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ బాలికల గురుకులం పాఠశాలలో సంబురాలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ నిరోషా పర్యవేక్షణలో విద్యార్ధినులు సాంస్క్రుతిక కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాస రచన,ప్రశ్నావళి,చిత్రలేఖనం పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధిని లను ప్రిన్సిపాల్ నిరోషా అభినందించారు. ఈ కార్యక్రమంలో బోధనా,బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.