బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం ఖాయం

– ఎంతో అభివృద్ధి చేశా
– సహకరించిన అందరికీ కృతజ్ఞతలు
– ఎమ్మెల్యే అభ్యర్థిని హరిప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
నేడు తీర్పు ఇవ్వనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది ప్రజలేనని, బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం ఖాయమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిని హరిప్రియ అన్నారు. స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్లోని ఎన్నికల కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంతోమంది నాయకులు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు సోషల్‌ మీడియా ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నుండి చేరిన నాయకులు, విజయం కోసం ఎంతో కృషి చేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో నమ్మకంతో వెన్నంటే ఉండి ప్రజా ప్రతినిధులు నాయకులు పార్టీని నడిపించారన్నారు. 70 ఏళ్లలో చేయని అభివృద్ధిని రెండు సంవత్సరాల్లోనే ప్రజల సహకారంతో చేయగలిగామని చెప్పారు.

Spread the love