నవతెలంగాణ-హైదరాబాద్ : మహా కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తుండగా వీడియో తీసిన జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలోని ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. కుంభమేళాను వీక్షీంచేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రభుత్వం భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భారీ ఏర్పాటు చేసింది. ప్రయాగ్ రాజ్ లో గంగా, యమునా, పౌరాణిక సరస్వతి నదుల కలయికగా ఏర్పడిన త్రివేణి సంగమం వద్ద భక్తులు స్నానాలు ఆచరించడం ప్రాముఖ్యతగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే స్నాన ఘాట్ వద్ద పుణ్య స్నానాలు చేస్తున్న మహిళలను కమ్రాన్ అల్వి అనే లోకల్ జర్నలిస్ట్ వీడియోలు తీశాడు. అంతేగాక వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, దీనిపై అసభ్యకరమైన కామెంట్లు పెట్టాడు. ఇది కాస్త వైరల్ కావడంతో, కొందరు వ్యక్తులు పోలీసులను ట్యాగ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియో తీసిన జర్నలిస్ట్ పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.