అమెజాన్‌ పార్సిల్‌లో పాము..వీడియో వైరల్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆన్‌లైన్‌ షాపింగ్‌లో భాగంగా అమెజాన్‌లో Xbox కంట్రోలర్‌ను ఆర్డర్‌ చేసిన ఓ జంటకు భయంకరమైన అనుభవం ఎదురైంది. బెంగళూరుకు చెందిన ఓ జంట తమకు వచ్చిన అమెజాన్‌ ఆర్డర్‌ను విప్పడానికి ప్రయత్నించగా అందులోంచి పాము బయటకు రావడంతో వారు భయాందోళన చెందారు. అయితే ప్యాకింగ్‌కు ఉన్న టేప్‌ చుట్టుకోవడంతో పాము బయటకు రాలేకపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అమెజాన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తమ ప్రాణాలకు ముప్పు కలిగే పరిస్థితి ఏర్పడిందని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. సంస్థ భద్రతా చర్యలను పాటించకుండా ఉండడం వల్లే ఈవిధంగా జరిగిందన్నారు. అమెజాన్‌ దీనిపై స్పందిస్తూ డబ్బు రీఫండ్‌ చేశామని తెలిపిందే కాని, క్షమాపణలు కూడా తెలపలేదని మండిపడ్డారు. వీడియో వైరల్‌ అవడంతో నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వైరల్‌ పోస్ట్‌పై స్పందించిన అమెజాన్‌ తమ తప్పిదానికి క్షమాపణలు కోరింది. ఆర్డర్‌ వివరాలు తెలిపితే ప్రాడక్ట్‌ను మళ్లీ డెలివరీ చేస్తామని తెలిపింది.

Spread the love