స్కూల్ అమ్మాయిలతో వాచ్‌మెన్ మసాజ్..అసభ్యకర పనులు.. వీడియో వైరల్

నవతెలంగాణ-హైదరాబాద్ : కస్తూర్బాగాంధీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినిలతో వాచ్‌మెన్ మసాజ్ చేయించుకుంటున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాకు చెందిన కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ వాచ్‌మెన్ ఆశోక్ విద్యార్థినులతో ఫేస్ మసాజ్ చేయించుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రాథమిక విద్యాశాఖ అధికారి కోమల్ సంగ్వాన్ విచారణ చేపట్టారు. ఈ ఘటనలో వాచ్‌మెన్‌తో స్కూల్లోని ఇతర సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు తాజాగా మీడియాకు తెలిపారు. అయితే విచారణలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. వాచ్‌మెన్ స్కూల్ బాలికలతో కలిసి డ్యాన్స్ చేయడం, ఫేస్ మసాజ్ చేయించుకోవడంతో పాటు.. స్కూల్ బాలికలకు వాచ్‌మెన్ ఫోన్‌లో అసభ్యకర వీడియోలు కూడా చూపిస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే, వీటి గురించి తమకు తెలియదని పాఠశాల వార్డెన్ ఖండించారు.

Spread the love