సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని మర్రికుంట, తిమ్మాపూర్, హబ్సిపూర్ గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ శ్రేణుల ప్రచారం నిర్వహించారు. ఈ సంద్భంగా దుబ్బాక మండల ఎన్నికల పరిశీలకులు ఎల్లు రవీందర్ రెడ్డి, దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పాలత కిషన్ రెడ్డి, జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ అస్క రవి, తిమ్మాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు రామవరం మాధవి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ….
2023 ఎన్నికల్లో దుబ్బాక గడ్డపై మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని, కొత్త ప్రభాకర్ రెడ్డి తోనే దుబ్బాక అభివృద్ధి సాధ్యమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.ప్రచారంలో భాగంగా ఓటర్ల నుంచి అనూహ్య స్పందన వస్తుందని కొత్త ప్రభాకర్ రెడ్డికి ఓటేసి గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారని వారన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి అబ్బుల రాజలింగం గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు పండరి రాజ లక్ష్మణరావు, తీపి రెడ్డి మహేష్ రెడ్డి, కోమటి రజినీకాంత్ రెడ్డి తదితరులున్నారు