విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’ టీజర్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్‌. గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్ట్ చేస్తున్నాడు. VD13 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. టైటిల్‌ లుక్‌, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. విజయ్‌ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యామిలీ స్టార్ టీజర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్‌. టైటిల్‌కు తగ్గట్టుగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ కు కనెక్ట్ అయ్యేలా కట్ చేసిన టీజర్‌ ఇంప్రెసివ్‌గా సాగుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. విజయ్ మ్యాన్లీ లుక్‌లో టీజర్ లో కనిపించడంతో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని వచ్చెనెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు.

Spread the love