నవతెలంగాణ -ఆర్మూర్
గత 42 సంవత్సరాలుగా పాఠశాలను నడుపుతూ ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన విజయ్ హై స్కూల్ సేవలు అభినందనీయమని సినీ నటి రాజశ్రీ అన్నారు. పట్టణంలోని విజయ్ హై స్కూల్ 42వ వార్షికోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది ..మొదట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చిన్ననాటి నుంచి ఏ రంగాలలో ప్రతిభ చూపుతారో గమనించి వారిని ప్రోత్సహించాలని, విద్యార్థిని విద్యార్థులకు చదువుతూ పాటు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు ఎంతో అవసరమని, ముఖ్యంగా విద్యార్థులలో సృజనాత్మకతను వెలిగి తీయడమే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం గర్వ కారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ విద్యా సంస్థల అభినేత్రి డాక్టర్ అమృతలత, ప్రిన్సిపాల్ కవిత దివాకర్ తదితరులు పాల్గొన్నారు.. వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థిని విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.