నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్గా ‘లియో’ తమిళ రెండో సింగిల్ #Badassని రిలీజ్ చేశారు మేకర్స్. అనిరుధ్ ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తో సాంగ్ ఆకట్టుకుంది. బాదాస్ మా..లియో దాస్ మా..అంటూ అనిరుధ్ తన వాయిస్ తో పిచ్చెక్కించేసాడు. ప్రస్తుతం తమిళంలో సాంగ్ రిలీజ్ అవ్వగా..త్వరలో తెలుగు లిరికల్ కూడా రిలీజ్ కానుంది. ఈ సాంగ్కి విష్ణు లిరిక్స్ అందించగా..అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేసి పాడారు. ఈ సాంగ్ కూడా మరో బ్లాక్బాస్టర్ హిట్ ట్రాక్ లో నిలవటం కన్ఫర్మ్ అనిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ దిమ్మతిరిగేలా ఉన్నాయి. ఈ మూవీలో సంజయ్ దత్ విలన్గా నటిస్తుండగా..యాక్షన్ కింగ్ అర్జున్ హెరాల్డ్ దాస్ అనే కీ రోల్ చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన హెరాల్డ్ దాస్ గ్లింప్స్..తెరికే అంటూ సింగిల్ డైలాగ్ తో అర్జున్ బీభత్సం క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని అక్టోబరు 19న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా..బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.