విజయ్ మాల్యా కుమారుడి పెండ్లి..

నవతెలంగాణ – హైదరాబాద్: పరారీలో ఉన్న లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా కుమారుడి వివాహ వేడుకలు లండన్‌లో ఘనంగా మొదలయ్యాయి. ఈవిషయాన్ని సిద్ధార్థ్‌ మాల్యా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి ప్రకటించాడు. ఈ సందర్భంగా ఫ్లవర్‌ ఫ్రేమ్‌లో తన ప్రియురాలు జాస్మిన్‌తో దిగిన ఫొటోను అతడు షేర్‌ చేశాడు.  సిద్ధార్థ్‌ 2023లో జరిగిన హాలోవిన్‌ సంబరాల్లో జాస్మిన్‌కు ప్రపోజ్‌ చేశాడు. దీనికి సంబంధించిన చిత్రాలు జూనియర్‌ మాల్యా ఇన్‌స్టాలో ఉన్నాయి.  వీటిలో జాస్మిన్‌ మాంత్రికురాలి డ్రెస్‌లో ఉండగా.. సిద్ధార్థ్‌ హాలోవిన్‌ పంప్‌కిన్‌ డ్రెస్‌ ధరించాడు.

Spread the love