విజయ్ సేతుపతి విశ్వరూపం చూస్తారు

విజయ్ సేతుపతి విశ్వరూపం చూస్తారువిజయ్ సేతుపతి నటిస్తున్న తన 50వ చిత్రం ‘మహారాజ’. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అయ్యింది. నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వంలో ప్యాషన్‌ స్టూడియోస్‌, ది రూట్‌ బ్యానర్స్‌ పై సుధన్‌ సుందరం, జగదీష్‌ పళనిసామి నిర్మించారు. అనురాగ్‌ కశ్యప్‌ పవర్‌ఫుల్‌ రోల్‌లో నటించారు. డిస్ట్రిబ్యూషన్‌ హౌస్‌ ఎన్‌విఆర్‌ సినిమా ఈ మూవీని ఏపీ, తెలంగాణలలో రిలీజ్‌ చేయనుంది. ఈ సినిమా ఈనెల 14న థియేట్రికల్‌ రిలీజ్‌ కానున్న నేపథ్యంలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ,’ఇది నా 50వ సినిమా. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం. తెలుగు ప్రేక్షకులందరూ సినిమాని ఇష్టపడతారనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ,’ఇందులో ఫ్యామిలీ ఎమోషన్‌ ఉంది. మాస్‌, క్లాస్‌ ఉంది. మంచి సినిమా చుశామనే తప్తిని ఇస్తుంది. విజరు సేతుపతి నటవిశ్వరూపం చూస్తారు’ అని అన్నారు. ‘విజయ్ సేతుపతి 50వ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా నేను పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని దర్శకుడు నితిలన్‌ సామినాథన్‌ చెప్పారు.

Spread the love