ఉపాధిలో వికారాబాద్‌ మొదటి స్థానం

– జిల్లాలో మర్పల్లి మండలం ప్రథమ స్థానం
– ప్రతి కుటుంబానికీ 100 రోజుల పని 30 వేల రూపాయలు
– ఉపాధి కూలీలకు ఓఆర్‌ఎస్‌ పాకెట్లు తాగునీరు అందుబాటులో ఉంచాలి
– అధికారులను ఆదేశించిన ఎంపీడీవో మల్లయ్య
నవతెలంగాణ-మర్పల్లి
గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ కూలి పనులు కల్పించడంలో తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉండగా మర్పల్లి మండలం వికారాబాద్‌ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉందని కూలీలు 300 రూపాయల కూలీ గిట్టుబాటు అయ్యేలా కొలతల ప్రకారం పనులు చేసుకోవాలని ఎంపీడీవో రాజ మల్లయ్య కూలీలకు సూచించారు,మండలంలోని కొత్ల పురం,మర్పల్లి గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి కూలీ పనులను మంగళవారం ఎంపీడీవో రాజ మల్లయ్య ఏపీవో అంజిరెడ్డితో కలిసి పరిశీలించారు,ఈ సందర్భంగా ఎంపీడీవో రాజ మల్లయ్య,ఏపీవో అంజిరెడ్డి లు మాట్లాడుతూ మర్పల్లి, కొత్ల పురం గ్రామాల్లో మంగళవారం 720 మంది కూలీలు పని చేయుచున్నారని మండలంలో మొత్తం 8450 మంది కూలీలు ఈరోజు పని చేయుచున్నారని వారు తెలిపారు,గత సంవత్సరము 100 రోజులు పని దినాలు కల్పించడంలో రాష్ట్రంలోనే వికారాబాద్‌ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా మర్పల్లి మండలం మొదటి స్థానంలో పూర్తి చేయడం జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి కషివల్లే జరిగిందని వారన్నారు,కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు టెలికాన్ఫరెన్స్‌ఎంపీడీవో,ఏపీఓ,ఎమ్మార్వోలకు,మున్సిపల్‌ కమిషనర్లకు,ఈజీఎస్‌ పనుల పైన గత రెండు నెలల నుండి రివ్యూ చేయడం జరిగిందన్నారు,ఈరోజు 1,10,000 పని దినాలతో రాష్ట్రంలోని 33 జిల్లాలలో వికారాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు,కూలీలకు 270 రూపాయలు నుంచి 300 కూలి తో సంవత్సరానికి 30 వేలు పడేవిధంగా కొలతలు ప్రకారం పని చేయించి పేమెంటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు అన్నారు,కూలీలకు ప్రతి గ్రామపంచాయతీ నుంచి నీటి సౌకర్యము,నీడ సౌకర్యము,ఓఆర్‌ ఎస్‌ ప్యాకెట్లు ఆశ వర్కర్లతో గ్రామపంచాయతీలో పెట్టించి కూలీలకు అందజేయాలని ఎంపీడీవో రాజ మల్లయ్య ఉపాధి హామీ సిబ్బందికి ఆదేశించారు, ఎంపీడీవో ఉపాధి పనులను తవ్వి పరిశీలించారు,అధికారుల ఆదేశానుసారం ఉపాధి పనులు చేపడుతున్న పంచాయతీ కార్యదర్శులకు,ఫీల్డ్‌ అసిస్టెంట్లకు,టెక్నికల్‌ అసిస్టెంట్లకు కలెక్టర్‌ అభినందించడం జరిగిందన్నారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రవికుమార్‌,శెట్టి,పురుషోత్తం టి ఏ,దినేష్‌,చంద్రం ఫీల్డ్‌ అసిస్టెంట్‌,లక్ష్మీకాంత్‌ పంచాయతీ కార్యదర్శి, వెంకటేష్‌ టి ఏ, లక్ష్మణ్‌ ఎఫ్‌ఎ తదితరులు పాల్గొన్నారు

Spread the love