నవతెలంగాణ – హైదరాబాద్: ‘తంగలాన్’ సినిమాలో బట్టతల ఉన్న వ్యక్తిగా నటించాలని దర్శకుడు పా.రంజిత్ కోరితే తాను వెంటనే అంగీకరించినట్లు హీరో విక్రమ్ తెలిపారు. అలా కనిపించేందుకు ఇబ్బందిగా ఫీలవలేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పలు చోట్ల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మూవీ స్టోరీ విభిన్నమని, ఇందులో గ్లామర్‌కు చోటు లేదని తెలిపారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉంటుందన్నారు.