విజయ్ ఆంటోని తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘విక్రమ్ రాథోడ్’. అపోలో ప్రొడక్షన్స్, ఎస్‌ఎన్‌ఎస్‌మూవీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కగా, బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహించారు.
రావూరి వెంకటస్వామి, ఎస్.కౌసల్య రాణి నిర్మాతలు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఓం శివ గంగా ఎంటర్‌ప్రైజెస్ (కె. బాబు రావు), పీఎస్‌ఆర్ ఫిల్మ్స్ (జీ పీఎస్ రెడ్డి) బ్యానర్లపై డిసెంబర్ 1న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. త్వరలోనే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు.
ఈ చిత్రంలో సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, ఛాయా సింగ్, యోగి బాబు, రాధ రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ ఇతర పాత్రల్లో నటించారు.