గ్రామ అభివృద్ధి కమిటీలను నిషేధించాలి 

Village development committees should be banned నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇన్చార్జి పెద్ది వెంకట రాములు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలను నిషేధించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి పెద్ది వెంకట రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ పిలుపులో భాగంగా గ్రామ అభివృద్ధి కమిటీలను నిషేధించాలని జిల్లాలోని అన్ని మండలాలలో తాసిల్దారుల ద్వారా ప్రభుత్వానికి 15, 16 తేదీలలో వినతి పత్రాలు సమర్పించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలం తాసిల్దారు కి సీపీఐ(ఎం) రూరల్ కమిటీ ఆధ్వర్యంలో సమర్పించారు. ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ.. తెలంగాణలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీల రూపంలో భూస్వాముల పెత్తనం నేటికి కొనసాగుతుంది. ఆర్మూర్ డివిజన్లో మరి బాల్కొండ నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో గ్రామ అభివృద్ధి కమిటీల నిరంకుశ కిరాతక చర్యలు కొనసాగుతున్నాయి. ‌ ఇందులో భాగమే ఎర్గట్ల మండలం, తాళ్లరాంపూర్ గ్రామంలో గత ఆరేడు నెలలుగా గౌడగీత కార్మికుల పై గ్రామ బహిష్కరణ నడుస్తుంది. ఈ మధ్యన శరీరంలోనికి మహిళలు కుంకుమార్చన కోసం వెళ్లగా గ్రామ అభివృద్ధి కమిటీ మరియు పూజారి ఏకమై వారిని అడ్డుకొని బయటికి నెట్టివేశారు. అంటే దేవుని పైన కూడా గ్రామ అభివృద్ధి కమిటీల వారు పెత్తనం చాలా ఇస్తున్నారన్నమాట. ఈ బరితెగింపు చర్యలను పరిశీలించడానికి తెలంగాణ సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజా సంఘాల నాయకులు, జిల్లా పార్టీ పాల్గొని సందర్శించాం. గ్రామ అభివృద్ధి కమిటీల పరాకాష్టకు కక్ష సాధింపుకు నిలువెత్తు నిదర్శనంగా వారి సొసైటీ కి చెందిన 65 సర్వే నెంబరు గల పదిఎకరాల భూమిలో తాటి ఈతవనం పెంచుకుంటే దాన్ని నిర్ధాక్షిణ్యంగా కాలబెట్టి గోడగీత కార్మికుల కడుపులు కొట్టారు దీనిపై స్పందించిన వెస్లీ 15,16 తేదీలలో ఎమ్మార్వోల ద్వారా ప్రభుత్వానికి మిమల్ని సమర్పించాలని సూచనతో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగమే నిజాంబాద్ రూరల్ మండలం తాసిల్దార్ కి వినపతన సమర్పించాము. దీనిపైన ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశాం. అరాచకులుగా మారిన చట్టబద్ధతలేని vdcలు నిషేధించాలని డిమాండ్ చేశారు. వీరికి చట్టం లెక్క ఉండదు, రాజ్యాగంతో లెక్క ఉండదు,. చట్టంతో పని ఉండదు, రాజ్యాంగాన్ని లెక్కచేయరు, కలెక్టర్ గారిని కూడా పట్టించుకోరు, సిపి మాటలు లెక్కచేయరు మరి ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీస్తున్నాం. వెంటనే నిషేదించాలి, ఎరుగట్ల గీత కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలి, ఆరు నెలలుగా వాళ్ళ పోషణ ఆగిపోయినది వాళ్ళ కళ్ళ ముఖాలు లేవు ఆరు నెలలుగా ఎంతైతే ఒక్కొక్క గీత కార్మికుడు కుటుంబానికి సంపాదించుకుంటాడు అంత గ్రామ అభివృద్ధి కమిటీ ద్వారా ఇప్పించాలని తెలంగాణ సీపీఐ(ఎం) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇంచార్జి పెద్ద వెంకటరావు డిమాండ్ చేశారు. లేనిచో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇన్చార్జి పెద్ది వెంకట్రాములు, శేఖర్ గౌడ్, చంద్రకాంత్, నర్ర శంకర్, సౌజన్య లు పాల్గొన్నారు.
Spread the love