ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పల్లె ప్రగతి దినోత్సవం

– సిర్పూర్ లో జెండా ఎగురవేసి ప్రగతి ఉత్సవాలు ప్రారంభించిన సర్పంచ్ కవిత శంకర్ పటేల్

నవతెలంగాణ మద్నూర్
మద్నూర్, దొంగిలి, మండలాల పరిధిలోని ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు పల్లె ప్రగతి ఉత్సవాలు ఆయా గ్రామ సర్పంచులు గ్రామ కార్యదర్శులు పంచాయతీ పాలకవర్గం సభ్యులు వివిధ శాఖల అధికారులు గ్రామాల ప్రజలు కలిసి జాతీయ జెండాలు ఎగరవేసి ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలోని సిర్పూర్ గ్రామ సర్పంచ్ కవిత శంకర్ పటేల్ జాతీయ జెండా ఎగురవేసి ఉత్సవాలు ప్రారంభిస్తూ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతి పథకాల ద్వారా గ్రామ పల్లెలు ఎంతో అభివృద్ధికి నోచుకున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ గ్రామంలోని ఉపాధ్యాయులు గ్రామ కార్యదర్శి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love