గ్రామ గ్రామాన పశు వైద్య సేవలు అందించాలి

– రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ భాగిష్ మిశ్రా
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ ప్రాంతంలో గ్రామ గ్రామాన పశు వైద్య సేవలు అందించాలని పశు సమర్థతశాఖ రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ భాగిష్ మిశ్రా అన్నారు.శనివారం హుస్నాబాద్ లో సంచార పశు వైద్యశాల టోల్ ఫ్రీ 1968 అత్యవసర వైద్య సేవల వాహనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ భాగిష్ మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1968 టోల్ ఫ్రీ తో పశువులకు గ్రామ గ్రామాన మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పశు వైద్య టోల్ ఫ్రీ వాహనంలోని మందులను, పరికరాలను పరిశీలించారు. ప్రతి గ్రామంలో పశువులకు మెరుగైన వైద్యం అందించేలా సిబ్బంది సహకరించాలని సూచించారు. వైద్య సేవలలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హుస్నాబాద్ లో 1968 తో పశు వైద్య సేవలు అందించడంలో సిబ్బంది సేవలు బాగున్నాయని అభినందించారు. . ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ మేనేజర్ సలీం, ఏ ఎఫ్ సి చక్రపాణి , డాక్టర్ స్రవంతి, పరవెట్ రోహిణి, రాజేష్,రవి, హెల్పర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love