
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ పనితీరుపై గ్రామంలోని రథం గల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గ్రామ శుభ్రత పట్ల ఆయన చేపట్టే పనులపై, అదేవిధంగా పశువులు తాగే పశువుల నీటితోటిని శుభ్రపరచడంలో మరువకుండా 15 రోజులకు ఒకసారి పంచాయతీ పారిశుద్ధ కార్మికుల ద్వారా శుభ్రం చేయించడం పట్ల గ్రామ ప్రజలు, గ్రామ కార్యదర్శి పని తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.