ఎమ్మెల్యేను సన్మానించిన గ్రామస్తులు..

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని రామేశ్వరపల్లి గ్రామస్తులు శనివారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను సన్మానించారు. శనివారం ఆయన నివాసానికి వెళ్లి శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని, అంతే కాకుండా ఆరోగ్య ఉపకేంద్రం తో పాటు పలుకుల సంఘ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినందుకు గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సహకార సంఘం అధ్యక్షులు భూమిరెడ్డి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పైతరి స్వామి, మండల భారత రాష్ట్ర సమితి ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Spread the love