చౌటుప్పల్ డీసీపిని సన్మానించిన ఖండేభల్లూర్ గ్రామస్తులు

నవతెలంగాణ – జుక్కల్
చౌటుప్పల్ డీసీపిని జుక్కల్ మండలం ఖండేభల్లూర్ గ్రామస్తులు సన్మానించడం జర్గింది. ఈ సంధర్భంగా గ్రామస్తులు శివరాజ్ దేశాయి మాట్లాడుతు ఖండేభల్లూర్ స్వగ్రామానికి చెందిన మెుగులయ్య ఎస్సై గా ఉద్యోగం ప్రారంబించి అంచెంలంచేలుగా ఉద్యోగంలో కష్టపడి సిఐ, డీఎస్పీగా పదోన్నోతి పొందుతు ప్రస్తుతం చౌటుప్పల్ ఏసీపిగా పదోన్నతి పొందారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఏసీపిగా పదవిబాద్యతలు తీసుకోవడంతో గ్రామస్తులు సంతోషంతో వారి కుటుంబ సబ్యులతో సంబురాలు నిర్వహించారు. గ్రామం నుండి పెద్దఎత్తున పెద్దలు చౌటుప్పల్ ఎసిపి కార్యాలయానికి చేరుకుని ఏసీపి మెుగులయ్యను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు శివరాజ్ దేశాయి, మాజీ సర్పంచ్ మెుయిన్, కృష్ణ రెడ్డి, కొమ్మ హన్మండ్లు, సాయులు, తదితరులు పాల్గోన్నారు.

Spread the love