నవ తెలంగాణ- గంభీరావుపేట:
గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంలో నాలుగు బోర్లు మోటారు పాడైపోయి సంవత్సరం గడిచిన పట్టించుకోవడం లేదని గ్రామస్థులు, మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. మంగళవారం ముస్తఫానగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి గ్రామంలో ప్రధానమైన తాగునీటి సమస్య, చెత్త సేకరణ సమస్యలుగా..అధికారులకు తెలియజేసే ఉద్దేశ్యంగా నిరసన తెలిపారు. గత 15 రోజుల నుండి గ్రామంలో చెత్త సేకరణ సరిగా లేదని గ్రామపంచాయతీ పాలకవర్గానికి, కార్యదర్శికి ఎంపీడీవోకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు మండిపడ్డారు. ముస్తఫానగర్ గ్రామపంచాయతీ యొక్క చెక్ పవర్ ఎంపీడీఓ కు ఉన్నందున సంబంధిత అధికారైనా పంచాయతీ కార్యదర్శి కూడా పట్టించు కోకపోవడంతోనే మహిళలు బిందెలతో రోడే క్కడంతో గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీనితో విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీడీఓ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొవడంతో తాగునీటి సమస్య, చేత్త సేకరణ సమస్యలను తెలపడంతో సమస్యను పరిష్కరించేందుకు కషి చేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ధర్నాను విరమించారు.