గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలి.. ఏసీఎల్బి ప్రియాంక

నవతెలంగాణ – చివ్వేంల: అన్ని గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా  మార్చాలని సూర్యాపేట ఏసీఎల్బి  ప్రియాంక అన్నారు. గురువారం  ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా చివ్వెంల మండలంలోని ఐలాపురం గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు.. వారం రోజులలో అన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి  గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలని అధికారులను ఆదేశించారు. మురికి కాలువలు లేని వీధులలో గల అన్ని ఇళ్లల్లోని వారు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని తెలిపారు. నల్ల నీటికి ఆన్ ఆఫ్  అమర్చుకొని నీటి వృధాను అరికట్టాలని తెలిపారు.. ఖాళీ స్థలాలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించుటకు గురించి యజమానికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. కొందరు గృహిణులను కలిసి చెత్త ట్రాక్టర్ ఎన్ని రోజులకు ఒకసారి చెత్త సేకరిస్తుంది అని,తడి-పొడి చెత్తను వేరు చేసి ఇచ్చుట గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల బ్యానర్ కూడా వినియోగించాలని ఆదేశించారు. ఆమె వెంట  ఎంపిడిఓ  లక్ష్మీ, ఎంపీవో   గోపి, గ్రామపంచాయతీ  స్పెషల్ ఆఫీసర్  శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి  శ్రీకాంత్, ఏ ఎన్ ఎం  విజయలక్ష్మి, ఆశా వర్కర్లు జ్యోతి లక్ష్మి, హేమలత, గ్రామ పంచాయతి సిబ్బంది,గ్రామస్తులు పాల్గోన్నారు…
Spread the love